కరోనా ఉపద్రవంతో ఇప్పుడు అప్పుడే మనం ఎవరమూ మాస్క్ లేకుండా బయటికి వెళ్లలేం. ఇండియాలాంటి ఉష్ణదేశాల్లో మాస్క్ వేసుకుని ఉండటం చాలా కష్టం. కానీ కరోనా వైరస్ సోకుతుందన్న ఆలోచనే భయం కలిగిస్తున్న పరిస్థితుల్లో అందరూ మాస్క్ వేసుకోవడానికి నెమ్మదిగా అలవాటుపడుతున్నారు.
ఐఫోన్ యూజర్లకు మరింత ఇబ్బంది
అయితే ఇలా మాస్క్ వేసుకోవడం వల్ల మామూలుగా జనం పడే ఇబ్బందులతోపాటు ఐఫోన్ యూజర్లకు మరో ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే ఐఫోన్లో ఫేస్ రికగ్నైజేషన్ ఐడీ ఉంటుంది. అంటేమన ఫేస్ చూస్తేనే ఫోన్ అన్లాక్ అవుతుంది. చాలా మోడల్స్లో ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. అందుకని ఫోన్ అన్లాక్ చేయాల్సి వచ్చినప్పుడల్లా మాస్క్ తీస్తే డేంజర్. దీనికోసం ఫేస్ అన్లాక్ కానప్పుడు ఐఫోన్ పాస్కోడ్ అడుగుతుంది. ఆరంకెల పాస్ కోడ్ టైప్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇదంతా కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని కాస్త సులువు చేసే ఓ చిన్న టెక్నిక్ ఐఫోన్ యూజర్లకోసం..
నాలుగు అంకెల పాస్వర్డ్ పెట్టుకోండి
1. ఐఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి ఫేస్ అండ్ పాస్కోడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి.
2. మీ ప్రస్తుత పాస్కోడ్ను ఎంటర్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి చేంజ్ పాస్కోడ్ ఆప్షన్ను టాప్ చేయండి.
3. మీ ప్రస్తుత పాస్కోడ్ను మరోసారి వెరిఫై చేశాక పాస్కోడ్ ఆప్షన్స్ను క్లిక్ చేయండి.
4. ఇప్పుడు 4డిజిట్ న్యూమరిక్ కోడ్ను సెలక్ట్ చేసి మీకు నచ్చిన నాలుగు అంకెల పాస్వర్డ్ పెట్టుకోండి.
5. మరోసారి నాలుగు అంకెల పాస్కోడ్ ఎంటర్ చేసి, పాస్కోడ్ చేంజ్ను కన్ఫర్మ్ చేయండి.
6. అంతే ఇకపై మీరు పాస్కోడ్ ఎంటర్ చేయాలంటే నాలుగు అంకెల పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు
సులువైన మార్గాలు తీసుకురానున్న యాపిల్
ఆండ్రాయిడ్ ఫోన్ను లాక్ తీసినట్టే స్క్రీన్ కింద నుంచి పైకి స్వైప్ చేసి డైరెక్ట్గా పాస్కోడ్ ఎంటర్ చేసే ఆప్షన్ను యాపిల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అది త్వరలో వచ్చే అప్డేట్లో రావచ్చు.
ఇలా చేయొద్దు
అస్తమాను ఫేస్ ఐడీకి వెళ్లి అది వర్కవుట్ కానప్పుడు పాస్కోడ్ కొట్టాలంటే చాలామంది ఇరిటేటింగ్గా ఫీలవుతారు. ఇలాంటి వాళ్ల కోసం ఫేస్ ఐడీ డిజేబుల్ చేసే ఆప్షన్ ఉంది. కానీ ఐఫోన్ సెక్యూరిటీలో అత్యంత కీలకమైనది ఫేస్ ఐడీ ప్రొటెక్షన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్ఐడీ డిజేబుల్ ఆప్ష్ను వాడొద్దు.
అలాగే లాకింగ్ టైమ్ డిలే చేసే ఆప్షన్ కూడా ఉంది. అది కూడా మీ సెక్యూరిటీకి ప్రమాదమే కాబట్టి దాన్నీ ట్రై చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
à°à°«à±‹à°¨à± à°…à°¨à±â€Œà°²à°¾à°•à±â€Œ ఫేషియ‌లౠఅనà±â€Œà°²à°¾à°•à±â€Œ à°à°«à±‹à°¨à± పాసà±â€Œà°•ోడà±â€Œ à°à°«à±‹à°¨à± నాలà±à°—ౠఅంకెల పాసà±â€Œà°•ోడà±â€Œ iPhone 4 digit pass code iPhone facial unlock